విజెఎఫ్ కాలంచెల్లిన అనధికార కార్యవర్గం చేసిన మోసాలు ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా వెలుగు చూస్తున్నాయి. విశాఖలోని సీతమ్మధార నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులను అద్దెకి ఇచ్చేసమ యంలో సదరు అనధికార కార్యవర్గం షాపులు నిర్వహించే వారితో చేసుకున్న ఒప్పందాలన్నీ లోప భూఇష్టంగానే ఉన్నాయి. ఈ మాట అగ్రిమెంట్ లోని అంశాలే రుజువు చేస్తున్నాయి. అందునా దివంగత కార్యదర్శి సోడి శెట్టి దుర్గారావు సంతకాల్లో తేడాలు, ఒకేసారి నాలుగేళ్లకు సరిపడా అద్దె ఒకే సారి తీసేసుకున్నారనే వీడియోలు, స్టాంపు పేపరు 2022 ఏప్రిల్ 21న కొనుగోలు చేసి నా..జన వరి31 నుంచే అగ్రిమెంటు రాసినట్టుగా చూపించడాలు, ఎక్కడా లేనివిధంగా షాపు అద్దెకి తీసుకు న్నవారు కాకుండా విజెఎఫ్ నుంచే కరెంటు బిల్లులు చెల్లించే విధంగా రాతలు రాయించడం ఇలా ఇక్కడి అగ్రిమెంట్లు అన్నీ తేడాగానే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా వీరిని సేవ్ విజెఎఫ్ సభ్యులు తప్పా మిగిలిన సోకాల్డ్ జర్నలిస్టులు ప్రశ్నించకపోవడం, మరెవరూ జరిగిన మోసాలపై కనీసం వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేయకపోవడం విశేషం. ఇప్పటికే సదరు కార్యవర్గం ఇచ్చిన ఆడిట్ రిపోర్టుల్లో భారీ ఎత్తున లక్షల్లో వచ్చిన తేడాల ఆధారంగా విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ సమయంలో కూడా విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లోని ఒక వర్గం పూర్తిగా తప్పులు మీద తప్పులు చేసినా కూడా అనధికార కార్యవర్గాన్నే వెనుకేసుకు రావడం విశేషం.
ప్రతీనెలా వేలల్లో వచ్చే ఆదాయాన్ని నేరుగా ప్రెస్ క్లబ్ సభ్యుల అనుమతిలేకుండా విచక్షణా రహితంగా ఖర్చులు పెట్టేయడం, దానికి తలా తోకాలేకుండా ఆడిట్ రిపోర్టుల్లో కాకిలెక్కలు చూపిస్తున్న వైనం కూడా జిల్లా ఆడిట్ అధికారులు చేసిన విచారణలో తేటతెల్లం అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వానికే తప్పుడు నివేదికలు ఇచ్చిన విజెఎఫ్ అనధికార కార్యవర్గంపై జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా ఆడిట్ అధికారి పోలీసు కేసు నమోదు చేయాల్సి వుంది. అయితే వారంతా జర్నలిస్టులు కావడంతో అధికారు ఆ దైర్యం చేయలేకపోయారు. అనధికార కార్యవర్గం ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్, ఈఫైలింగ్ చేయించకుండా వేసిన ఉత్తుత్తి ఆడిట్ రిపోర్టులు మాత్రమే ఇచ్చి, సర్వసభ్య సమావేశం తీర్మానాలు లేకుండా సొసైటీని అడ్డదారిలో రెవిన్యువల్ చేయించినా ప్రభుత్వ అధికారులు సైతం పల్లెత్తు మాట వారిని అనకపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో విజెఎఫ్ అనధికార కార్యవర్గాన్ని చేసిన తప్పుల నుంచి అధికారికంగా చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఒక వర్గం జర్నలిస్టులు.. మరో వర్గం కొందరు సదరు వ్యక్తి యొక్క సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా అడ్డుపడుతూ, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టును తుంగలోకి తొక్కి, చట్టవిరుధ్దంగా వ్యవహరించిన అనధికార కార్యవర్గంపై జిల్లా రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వున్నా కేవలం ఆధారాలను జిల్లా కలెక్టర్ కి నివేదించి చేతులు దులుపుకున్నారు.
ఇప్పటికే అనధికార కార్యవర్గంలోని అధ్యక్షుడిగా ఉన్న గంట్లశ్రీనుబాబుని సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితునిగా తొలగించాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా ఇటు దేవస్థానం ఈఓకి, నమోదైన 420 కేసు ఎఫ్ఐఆర్ పత్రాలు దేవాదాయశాఖ కమిషనర్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్టు కూడా తెలిసింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ 1987చట్టం ప్రకారం 15 నుంచి 20 అంశాల ఆధారంగా సెక్షన్ 19ని అమలు చేస్తూ
ట్రస్టుబోర్టు సభ్యుడిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోతే సింహాచలం దేవస్థానం ఈఓపై కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ తంతు ఆలస్యం అయ్యిందని తెలుస్తుంది. కాగా ఈలోగా నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులు లీజుకి ఇచ్చే సమయంలో అనధికార కార్యవర్గం చేసిన చిత్రాలు, ఆధారాలతో సహా బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. ఇంకా ఇదే భవనంలోని బ్యాకరీ, ఆపైన మొదటి అంతస్తు, టెర్నస్ పైన
హోర్డింగ్ లకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా బయటకు రావాల్సి వున్నది. ఒక్క చిన్నషాపుకి సంబంధించిన అగ్రిమెంటునే తేడాగా రాసిన అనధికార కార్యవర్గం మిగిలిన షాపుల విషయంలో ఇంకెన్ని తేడాలకు పాల్పడి ఉంటుందోననే అనుమానాలను ప్రెస్ క్లబ్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు, ఏరకంగా అనధికార కార్యవర్గాన్ని వెనుకేసుకు వస్తూ..చేసిన తప్పులను ప్రశ్నించకపోయినా.. బయటపడుతున్న ఆధారాలు, తేడా వ్యవహారాలతో విజెఎఫ్ చిత్రాల వేడిని అమాంతం పెంచేస్తున్నది. చూడాలి ఈ అనధికార కార్యవర్గంపై విచారణ చేపడుతున్న జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అనేది..!