ఎమ్మెల్యే సారూ.. మహిళా పోలీసులకు న్యాయం చేయండి


Ens Balu
114
Mangalagiri
2023-08-03 16:49:35

గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసుల పరిస్థితి గాల్లో దీపంలా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వద్ద మహిళా పోలీసులు తమ గోడును వినిపించారు. తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.  కోర్టుకేసులతో పోలీసుశాఖలో పనిచేస్తున్న తమ విధులు పూర్తిగా తొలగించడంతో లైన్ డిపార్ట్ మెంట్ లేకుండా చేశారని, డ్యూటీ చార్టు కూడా మారిపోయిందని ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖలు ఉండగా సచివాలయాల్లో తమ పరిస్థితి దారుణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్లం చేశారు.  గ్రామ సంరక్షణలో కీలకంగా వ్యవహరించే తమను ఆ విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తమను పోలీసుశాఖలోనే కొనసాగే విధంగా న్యాయం చేయాలని ఎమ్మెల్యేని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని సీఎం వైఎస్.జగన్ మోహనరెడ్డి ద్రుష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహాలక్ష్మి, కార్యదర్శి మధులత, గుంటూరు డిస్ట్రిక్ట్ ఇంచార్జీ ప్రెసిడెంట్ అమ్ముల రాధిక, జనరల్ సెక్రెటరీ గౌసియా బేగం,అడిషనల్ జనరల్ సెక్రెటరీ గీతా పావని, ట్రెజరీ సుమతి అండ్ ఎంటిఎంసి మహిళా పోలీస్ దేవిప్రసన్న, దేవి పద్మ, స్వాతి,కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.