అన్యాయంపై పోరాడితే కేసులు పెడతారా..ఏపి రెడ్డి సంఘం


Ens Balu
56
Guntur
2023-08-04 11:23:45

ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గంపై జరుగుతన్న అన్యాయంపై పోరాటం చేస్తుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారా అని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 3 రోజుల కిందట అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకి బలైన రెడ్డి కుటుంబాలతో కలిసి అనంతపురంజిల్లా  పుట్లూరు మండలంలో చేసిన ఆందోళనపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి పై కేసులు పెడతాము, అరెస్ట్ అయ్యే విధంగా ఒత్తిడి తెస్తాము అనడం బావ్యం కాదన్నారు. ఈ చట్టం ద్వారా రెడ్లను కాపాడుకునేందుకు నరేష్ కుమార్ రెడ్డి మీడియా ద్వారా నిరసన తెలియచేశారు. మీ వర్గం కోసం మీరు ఏ విధంగా పోరాడుతున్నారో రెడ్డి వర్గం కోసం రాజకీయాలకు, హోదాలకు అతీతంగా నరేష్ కుమార్ రెడ్డి పోరాడుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ  కేసులు పెడతామంటే, అరెస్టు చేయిస్తామంటే, బెదిరే వ్యక్తి గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి కాదన్నారు. అన్యాయం గురించి మాట్లాడే హక్కు భారతీయ పౌరుడిగా, ప్రతి ఒక్కరికి ఉంటుందనే  విషయాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య  గమనించాలని సూచించారు. ప్రశ్నించినంత మాత్రాన, పోరాటాలు చేసినంత మాత్రాన, అక్రమ కేసులు పెడతామంటే  న్యాయస్థానాలు పోలీసులు చూస్తూ ఉరుకోరని గుర్తుచేశారు. గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డికి తోడుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా అన్యాయానికి గురైన, అక్రమంగా అరెస్టు అయిన రెడ్లతో పాటు ఇతర ఓసీలు, బీసీలు, మైనార్టీలు తోడుగా ఉన్నారన్న విషయాన్ని మీరు మరిచిపోవద్దని తెలియజేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం బెదరదన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా అన్యాయానికి గురైన రెడ్లకు,  ఇతర కులాల వారికి ఎల్లప్పుడు మేము తోడుగా, అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు అన్నెం విజయ భాస్కర్ రెడ్డి, పెద్ధి రెడ్డి, తమ్మినేని గోపాల్ రెడ్డి, పట్నం సురేంద్ర రెడ్డి, భరత్ రెడ్డి, కె.రామకృష్ణా రెడ్డి, సాంబశివ రెడ్డి, అరుణ కుమారి, విశ్వనాథ రెడ్డి, శ్రీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు