ప్రశాంతంగా ఏపిపీజీఇసెట్‌..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-28 14:56:55

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌, ‌ఫార్మశీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపిపీజీఇసెట్‌ ‌ప్రవేశ పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన జియో ఇంజనీరింగ్‌-‌జియో ఇన్ఫర్మేటిక్స్(‌జిజి) పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఎంపిక చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించారు. ఉదయం నిర్వహంచిన జియో ఇంజనీరింగ్‌-‌జియో ఇన్ఫర్మేటిక్స్ ‌పరీక్షకు 52 శాతం మంది హాజరయ్యారు. మద్యాహ్నం నిర్వహించిన కంప్యూటర్‌ ‌సైన్స్-ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ(సిఎస్‌) ‌పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏపిపీజీఇసెట్‌ ‌కన్వీనర్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఆచార్య భాస్కర రెడ్డి, ఆచార్య డి.లలిత భాస్కరి తదితరులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో 40 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాదులో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు.  తొలిరోజు నిర్వహించిన జియో ఇంజనీరింగ్‌ ‌పరీక్షకు 72 మంది, కంప్యూటర్‌ ‌సైన్స్ ‌పరీక్షకు 4084 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీచేసి పరీక్షకు అనుమతించారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి, శానిటైజర్‌ ‌వినియోగిస్తూ పరీక్షలకు హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించారు.