ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు తమ ప్రధాన సమస్యను బాపట్ల ఎంపి నందిగంసురేష్ కు తమ సమస్యను విన్నవించారు. ఈ మేరకు శనివారం గుంటూరు డిస్ట్రిక్ట్ కమిటీ జాయింట్ సెక్రటరీ ఇందుర్తి శైలజ, తుళ్లూరు మహిళా పోలీసులు ఎం. రంగవల్లి, ఇ. శ్రీలక్ష్మి, డి.సంపూర్ణ, ఎన్.శిరీష, కె.శ్రావణి,ఆర్.లక్ష్మి ప్రసన్న,పి. మాధవి, ఎం.నాగత్రివేణి, నీరజ, సరళ తదితరులు ఎంపీని కలిసి ఇటీవల కాలంలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు సరైన జాబ్ చార్ట్, లైన్ డిపార్ట్మెంట్ లేకపోవడం వలన తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నామని ఎంపికి వివరించారు. హోం డిపార్ట్మెంట్ నే తమకు మదర్ డిపార్ట్మెంట్ గా కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు రూల్స్ తో కూడిన ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. సమస్యను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళతానని సచివాలయ మహిళా పోలీసులకు ఎంపీ హామీ ఇచ్చారు.