విశాఖజిల్లా(ఉమ్మడి)లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు త్వరలోనే అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు అనకాపల్లి జాల్లా ఏఎస్పీ(అడ్మిన్) బి.విజయభాస్కర్ తెలియజేశారు. ఆయన సోమవారం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net సంయుక్త ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బదిలీలు, వాటికి సంబంధించిన కౌన్సిలింగ్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్త యిందన్నారు. ఆ ఫైలుని విశాఖజిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జునకు నివేదించామని, అక్కడి నుంచి అనుమతి రాగానే అందరికీ ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు అందజేయనున్నామ న్నారు. దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఏఎస్పీ వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఆర్డర్లు మహిళా పోలీసులకు అందజేస్తామని చెప్పారు.