చేనేత దినోత్సవం స్ఫూర్తితో నేతన్నలకు ప్రోత్సాహం


Ens Balu
24
Visakhapatnam
2023-08-07 08:34:33

జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇద్దామని జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ పేర్కొన్నారు.  జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విశాఖ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్ ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. వస్త్ర ప్రదర్శన లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల డిజైను లని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఆస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. గత సంవత్సరం చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకపై ప్రతి వారం వస్త్ర ప్రదర్శన స్టాల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ వంటి ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు  చేస్తోందన్నారు. చేనేత ఉత్పత్తులకు ఆప్కో ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తోందన్నారు. వైఎ్‌సఆర్‌ నేతన్న నేస్తం కింద మగ్గాల ఆధునికీకరణకు ప్రతి చేనేత కార్మికుడికి రూ.24 వేలు ఇస్తోందన్నారు.  చేనేత వస్త్రధారణ ఆరోగ్యదాయకమని, ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో  చేనేత జౌళిశాఖ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ రమణమ్మ, డి ఎల్ డి ఓ పూర్ణిమా దేవి, డి ఈ ఓ చంద్రకళ, ఏ డి విభిన్న ప్రతిభా వంతుల శాఖ మాధవి, తదితర జిల్లా మహిళా అధికారిణి లు , సిబ్బంది, 
వివిధ చేనేత సొసైటీలు, నేత కార్మికులు పాల్గొన్నారు.