77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అధికారులతో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే వేడుకలను పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మైదానంలో ఏర్పాట్లను పోలీస్ శాఖ, జిల్లా రెవెన్యూశాఖ , అలాగే సౌండ్ సిస్టం ఏర్పాట్లను సమాచార శాఖ డిఐపిఆర్ఓ పర్యవేక్షించాల న్నారు. వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి, తాగునీరు శానిటేషన్ జీవీఎంసీ జోనల్ కమిషనర్, డిపిఓ పర్యవేక్షిస్తారని చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, తాగునీటి సరఫరా, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య, పట్టణాభివృద్ధి, డ్వామా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖలు జిల్లాలో ఆయా శాఖల అభివృద్ధిని తెలియపరిచే శకటాలను ప్రదర్శించాలన్నారు. జాయింట్ కలెక్టర్ మెరిట్ సర్టిఫికెట్లను పర్యవేక్షిస్తారని, ముఖ్య ప్రణాళిక అధికారి, జి ఎస్ డబ్ల్యు ఎస్ ప్రత్యేక అధికారి కార్యక్రమాల అనుసంధాన, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.