ఎస్ఎస్ఆర్ ఓటరు జాబితా సవరణ గుర్తించాలి


Ens Balu
40
Rajamahendravaram
2023-08-08 14:41:13

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరుపుతున్న ఇంటింటి సర్వే లో బూత్ స్థాయి అధికారులు ఓటరు గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం నియోజక వర్గాల వారిగా ఓటరు గుర్తింపు సర్వే పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి నియోజక వర్గ ఈ ఆర్ ఓ, సహాయ ఈ ఆర్ వో లతో సర్వే పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సమీక్ష లో భాగంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, వచ్చే ఏడాది రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహించే క్రమంలో ఓటరు జాబితా లో ఓటరు గుర్తింపు, ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు కల్పించడం, ఇల్లు, నియోజక వర్గం మారిన ఓటరు గుర్తింపు, మరణించిన వారి వివరాలు వంటి ప్రతి ఒక్క ప్రక్రియ ను అత్యంత జాగ్రత్తగా సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి లో బూత్ స్థాయి లో ఇంటింటి సర్వే ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా నియోజక వర్గ స్థాయి ఓటరు నమోదు చేసే ఈ ఆర్ వో లు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మార్పులు,  చేర్పులు, యువ ఓటరు నమోదు పై వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టి రాబోయే 14 రోజులు అత్యంత కీలకం అని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్,  జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, నియోజక వర్గ ఈ ఆర్ ఓ, సహాయ ఈ ఆర్ వో, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు