విజయనగరం జిల్లాలో 1407 జంటలకు వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు ఇంచార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. అల వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు, వై.యస్.ఆర్ షాది తోఫా పథకం క్రింద 2023 ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న 18,883 జంటలకు రూ.141.60 కోట్లు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి వర్చువల్ గా బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వర్చువల్ కాన్ఫరెన్స్ లో జిల్లా ఇంచార్జ్ శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు, డి ఆర్ డి ఏ పి.డి కల్యాణ చక్రవర్తి , జి.ఎస్.డబ్ల్యూ. జిల్లా కార్డినేటర్ నిర్మల దేవి, రెడ్డికే వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రౌతు భాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ జిల్లాలో 1168 బిసి - జంటలకు , 149 ఎస్.సి జంటలకు , 26 ఎస్.టి జంటలకు , 17 దివ్యాంగ జంటలకు , 7 మైనారిటీ జంటలకు ఇంటర్ చస్తే వారికి వెరసి 1407 జంటలకు రూ.8.32 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు, వై.యస్.ఆర్ షాది తోఫా పథకాలతో ఆర్థిక కారణాలతో మధ్యలోనే విద్యను నిలిపి వేసే అవకాశం బాగా తగ్గుతుందని అన్నారు. సామాజిక మార్పులో ఒక విశిష్టమైన పాత్రను పోషిస్తుందని అనడంలో సందేహం లేదని ఆయన చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి తదితర వర్గాలకు ఇది ఎంతో సహాయంగా ఉంటుందని ఆయన అన్నారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు నుండి బయటకు రావడానికి, సామాజిక హోదా, సామాజిక సామరస్య సాధనకు ఇది దోహదం చేస్తుందని అన్నారు.