డిసిఎంఎస్ ను ప్రగతిపథంలో నడిపించాలి


Ens Balu
34
Anakapalle
2023-08-09 15:03:27

ప్రగతి పథంలో డిసిఎంఎస్ ను నడిపేందుకు అందరి సహకారం అవసరమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి  డిసిఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం విశాఖపట్నం కో- ఆపరేటివ్ మార్కెటింగ్ సోసైటీ (డిసిఎంఎస్) కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మశ్రీ మాట్లాడుతూ కోపరేటివ్ వ్యవస్థ గాజుబొమ్మ లాంటిదని ఆయన అభివర్ణించారు.  ప్రోఫర్టీ ఉండి ప్రోఫిట్ లేని సంస్థ డిసిఎంఎస్ అని ఆయన అన్నారు. ఈ సంస్థ లాభాలు బాట పట్టేందుకు అందరి సహకారం అవసరమన్నారు. బిసిలు బ్యాక్ బొన్ లాంటి వారన్నారు. పార్టీ ని నమ్ముకున్న వారి కి పదవులు వస్తుంటాయని అన్నారు. అయితే కొన్ని సామాజిక సమీకరణలు వల్ల పదవులు ఒకేసారి అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు.యాదవ్ లకు సముచిత స్థానం కల్పించి ఇలాంటి సంస్థ కు ఛైర్మన్ పదవి కేటాయించడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ని అందరూ ఆదరించాలని ఆయన అన్నారు. తొలుత నూతనంగా డిసిఎంఎస్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పల్లా నర్సింగరావు  ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు నర్సింగరావు కు గజమాలాలుతోను, పూల బొకే లతోను ఘనంగా సత్కరించారు.

 ఈసందర్భంగా డిసిఎంఎస్ ఛైర్మన్ నర్సింగరావు మాట్లాడుతూ  అందరి సహకారం తో సంస్థ ను ప్రగతి బాట లో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కి, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ కి అభిమానులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె. విష్ణుమూర్తి, ఆనంద్, ఎ.సత్యారావు, డేవిడ్, కె. దేముడు,పి.అప్పారావు, కలగా సోమునాయుడు, సేనాపతి సత్యారావు, దొండా రాంబాబు, వెంకటరావు, కోనపల్లి రామమోహనరావు, డిసిఎంఎస్ పాలకవర్గ సభ్యులు పి.డి నర్సింగరావు (గాంధీ), జి. సత్యదేవ్, పి.అప్పారావు,ఎస్.సుకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు