పి.ఎం.ఇ.జికు దరఖాస్తు చేసుకోండి..
Ens Balu
3
Srikakulam
2020-09-28 18:33:47
శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకం (పి.ఎం.ఇ.జి)క్రింద అర్హులైన నిరుద్యోగుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలో 18 ఏళ్లు వయస్సు నిండి, కనీసం 8వ తరగతి పాసైన నిరుద్యోగులు పి.ఎం.ఇ.జికు అర్హులని తెలిపారు. జిల్లాలో పరిశ్రమ మరియు సేవా పథకాలు స్థాపించుటకు దరఖాస్తులను డిఐసి/ కెవిఐసి / కెవిఐబి ద్వారా www.kviconline.gov.in వెబ్ సైట్ నందు సమర్పించాలని కోరారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు ప్రతి నెల వచ్చిన దరఖాస్తులను ఎంపిక చేసి సంబంధిత బ్యాంకులకు సిఫారసు చేయబడుతుందని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తెలియని అభ్యర్ధులు జిల్లా పరిశ్రమల కేంద్రమును సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.