వైఎస్సార్ జలకళతో రైతులకు సిరులు..


Ens Balu
2
కలెక్టరేట్
2020-09-28 18:39:21

వైఎస్సార్ జలకళ తో రైతులు మరింతగా పంటలు పండించుకోవడానికి అవకాశం వుంటుందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం  విశాఖజిల్లా  కలెక్టరు కార్యాలయ ఆవరణలో  "వై.ఎస్.ఆర్. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం"  పోస్టరును, కరపత్రిక ను పర్యాటక శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎం. పి.  వెంకట సత్యవతి, జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్, ఇ .పి.డి .సి .ఎల్.  సి. ఎం. డి. నాగలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ , ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్ పై లోడ్ ఎక్కువవడం వలన  లో ఓల్టేజ్  సమస్య రాకుండా ఉండాలన్నా, రైతులకు  మంచి జరగాలన్నా తప్పనిసరిగా మీటర్లు పెట్టాలని  తెలిపారు. ఎన్ని గంటలు కరెంట్ వస్తుంది,  ఎంత నాణ్యమైన  కరెంటు వస్తుంది, రావలసిన ఓల్టేజ్ లో వస్తుందా లేదా  అని తెలుసుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చునని మంత్రి తెలియజేసారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ సూర్యప్రతాప్,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు  సింహాచలం నాయుడు మరియు  ఇతర అధికారులు  హాజరయ్యారు.