పోరాట స్ఫూర్తికి జాషువా ప్రతీక..మంత్రి అవంతి
Ens Balu
2
వుడా చిల్డ్రన్స్ థియేటర్
2020-09-28 18:59:47
మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా పేరిట రూ 3 కోట్లతో నిర్మించే కళా ప్రాంగణాన్ని ఆయన జన్మదినం నాటికి పూర్తి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం వి.ఎం.ఆర్.డి.ఎ.చిల్డ్రన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన 125వ జయంతి రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోరాట స్ఫూర్తికి ప్రతీక జాషువా అని, అతని చిన్నతనంలో ఎన్ని అవమానాలు ఎదురైనా కుంగిపోకుండా ఎదురు తిరిగి పోరాడి కీర్తి శిఖరాలను అధిరోహించారన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల వారికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు. రిజర్వేషన్ లేకుండా దళితులందరూ అభివృద్ధి సాధించిన దినోత్సవం అని పేర్కొన్నారు. ఆరిన వర్గాలవా ఆ తీస్తే అది కూడా చేస్తానురు ముఖ్యంగా సాంఘిక హోదా కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
జాషువా దళితుడిగా సాంఘిక బహిష్కరణ ఎదురుకొంటూనే పట్టుదలతో పోరాటం చేస్తూ తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో తనకంటూ ఓ స్థానం సంపాదించు కుంటూ నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి, సామ్రాట్, పద్మభూషణ్ బిరుదులు పొందే స్థాయికి ఎదిగారని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కొనియాడారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. అగ్రవర్ణ దురహంకారాన్ని చవిచూసిన జాషువా సౌమ్య పదజాలంతో నే వాటిని ఎదిరించారు అని చెప్పారు. “నాకు గురువులు ఇద్దరు పేదరికం, కుల మత భేదం. మొదటి ఓర్పును నేర్పితే రెండవది ఎదిరించే ధైర్యాన్నిచ్చిందని” జాషువా చెప్పేవారన్నారు, హిందువుల బహిష్కరణలు క్రైస్తవుల నిరసన లనూ ఎదుర్కొన్నారు. తిరుపతి వెంకట కవులు అయిన చల్లపిల్ల వెంకట శాస్త్రి జాషువా గారి పాదాలకు గండపెండేరం తొడిగారిని, ఆయన రచనలు శబ్దాలంకారం భాష పండిత పామరుల ప్రశంసలను పొందాయన్నారు. ఆయన రచించిన గబ్బిలం నవలను గూర్చి వివరించారు.
జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జీవితంలో సాంఘిక వేదనలు, కష్టాలు చవి చూసిన జాషువా సమాజంతో బడుగు బలహీన వర్గాల హక్కులను గూర్చి అణగారిన వర్గాల హక్కులను సాధించడానికి మార్గదర్శకత్వం అయ్యారని పేర్కొన్నారు. ఆయన చిన్నతనంలోనే అసమానతలు సమాజ రుగ్మతలపై పోరాడారన్నారు. సామాన్య తెలుగులో సరళంగా స్పష్టంగా సూటిగా చెప్పే రచనలు కవిత్వాలను మనకు అందించారన్నారు. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి అధ్యక్షురాలు వంగపండు ఉష మట్లాడుతూ జాషువా కవిత్వం గుండెలను తాకుతుంది అని, “వడగాల్పు నా రచన - వెన్నెల నా కవిత్వం” అన్న మహనీయుడని తెలిపారు. కవిత్వమే ఆయుధంగా ఆయన మూఢాచారాలపై యుద్ధం చేశారన్నారు. జివిఎంసి కమిషనర్ జి సృజన, కమిషనర్ పి.కోటేశ్వరరావు ప్రసంగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ఎన్.ప్రసాదరావు,ఎస్సీ, ఎస్టీల పై దాడుల మానిటరింగ్ కమిటీ సభ్యులు పి మల్లేశ్వరరావు, జోసెఫ్ చెన్న సత్యం వెంకటేశ్వరరావు అప్పన్న, వంగపండు ఉష తదితరులను సత్కరించారు. అనంతరం మంత్రి గుంటూరులో నిర్మించబోయే జాషువా కళాప్రాంగణం ఆకృతి (Tomb)చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎం.ఆర్.డి.ఏ. కమిషనర్ పి. కోటేశ్వరరావు, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు సాంస్కృతిక సమితి డైరెక్టర్ మల్లిఖార్జునరావు సాంఘిక సంక్షేమ శాఖ జెడి రమణమూర్తి ఏ విజయనిర్మల వంశీకృష్ణ యాదవ్ మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.