స్పందన అర్జీలపై స్పందించాలి..
Ens Balu
3
జివిఎంసి ప్రధాన కార్యాలయం
2020-09-28 19:06:33
జివిఎంసికి వచ్చే స్పందన , ఇ.ఆర్.పి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం జీవి.ఎం.సి. సమావేశ మందిరం నుంచి జి.వి.ఎం.సి. హెచ్.ఓ.డిలతో కలిసి అన్ని జోనల్ కమిషనర్లు వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా స్పందనలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఈ రోజు సాయంత్రం లోగా పూర్తీ చెయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన అంశంపై ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు ఎక్కువుగా పెండింగులో ఉన్నాయని రెవెన్యూ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జి.వి.ఎం.సి. అధికారులు మరియు అన్ని జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, ఆర్. సోమన్నారాయణ, ప్రధాన ఇంజినీరు వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, అసిస్టెంట్ డైరెక్టర్(ఉద్యాన శాఖ) ఎం. దామోదర రావు తదితర అధికారులు పాల్గొన్నారు.