భగత్ సింగ్ దైర్యసాహసాలకు ప్రతిరూపం..
Ens Balu
2
ఆర్ కే బీచ్
2020-09-28 19:13:53
భగత్ సింగ్ దేశభక్తిని ధైర్యసాహసాలను ఈ నాటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం రామకృష్ణ బీచ్ లో గల భగత్సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించాడని తెలిపారు.. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడని చెప్పారు. భగత్ సింగ్, అసమాన దేశభక్తుడని, జ్వలించే నిప్పుకణిక, రెపరెపలాడే విప్లవ పతాకగా ఆయన అభివర్ణించారు. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయని, 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ధైర్యంగా ఉరి కంబానికి వెళ్లాడన్నారు. ఆయనను తన స్నేహితులయిన విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులతో బ్రిటీషువారు ఉరితీశారన్నారు. ఆయన ఏ మాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు చేరి దేశ స్వాతంత్రోద్యమం ఉప్పెనలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు నాయకులు పాల్గొన్నారు.