ఆర్థిక నేరాలలో అడ్డంగా దొరికిపోయినా, తాను ఇంకా నిజాయితీపరుడనంటూ చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నాడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమ ర్నాథ్ అన్నారు. సోమవారం విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆర్థిక నేరాలను అంకెలతో సహా ఆదా య పన్ను శాఖ అధికారులు రుజువు చేసినా, వాటితో తనకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు బుకాయించటం విడ్డూరంగా ఉందని అన్నారు. కుట్రలు, కుతంత్రా లు, అవినీతితో నిర్మితమైన ఆయన రాజకీయ జీవితం అంతా చీకటి చరిత్ర అని అమర్నాథ్ విమర్శించారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుకే ఉన్నాయని ఆయన చెప్పారు. ఏలేరు, స్టాంపుల కుంభకోణాలలో బాబు హస్తం ఉందని అనేకసార్లు రుజువైందని ఆయన చెప్పా రు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన రాజకీయంలోకి వచ్చారని ఆయన అన్నారు. నారావారిపల్లె నుంచి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు ఆయన ప్రతి అడుగు అవినీతి మయమేనని అమర్నాథ్ విమర్శించారు. తాను నిజాయితీపరుండని రోజు ప్రవచనాలు వల్లించే చంద్రబాబు నాయుడు 118 కోట్ల రూపాయల తన లంచావతారం గురించి ఎందుకు మాట్లాడటం లేదని అమర్నాథ్ ప్రశ్నించారు. అన్నా హజారే వారసుడునని, గాంధీజీ తమ్ముడనని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన అవినీతి ఆరోపణలపై వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా, చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఐటీ శాఖ బాబు బాగోతాన్ని స్పష్టంగా వివరిస్తూ, ఆయన ఎక్కడెక్కడ నుంచి డబ్బులు ఎలా దండుకున్నాడో 46 పేజీల షోకాస్ నోటీసులో స్పష్టంగా పేర్కొందని అమర్నాథ్ చెప్తూ, దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించకపోగా, తన పేరు అందులో లేదు కదా, మీరెవరు నాకు నోటీసులు ఇవ్వడానికి అంటూ ఐటీ అధికారులను అర్థం లేని ప్రశ్నలు వేస్తూ తప్పించుకుంటున్నాడని ఆయన అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ బాబు గారి ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని, టిట్కో ఇల్లు, హైకోర్టు నిర్మాణం సి ఆర్ డి ఏ లో చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించి డబ్బులు ఏవిధంగా తీసుకున్నారో వెల్లడించారని ఆయన తెలియజేశారు. దుబాయ్ నుంచి కూడా దినామ్స్ లో 15 కోట్ల రూపాయలు వరకు చేజిక్కించుకున్నారని అమర్నాథ్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు అధికారులను మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు 350 కోట్ల రూపాయలు కొట్టేసారని ఆయన వివరించారు.
చంద్రబాబు నాయుడు అవినీతి చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళతామని, ప్రజా కోర్టులో ఆయన సమాధానం చెప్పుకోవాలని, ఆయనకు శిక్ష తప్పదని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరాల విషయంలో ఈ.డి. జోక్యం చేసుకోవాలి అని అమర్నాథ్ డిమాండ్ చేశారు.