నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి


Ens Balu
26
Srikakulam
2023-09-04 09:03:32

నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కారుణ్య నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉద్యోగులు కోవిడ్ తో మృతి చెందారని.. సదరు మృతి చెందిన కుటుంబ సభ్యులకు గ్రామ, వార్డు సచివాలయాలలో వివిధ శాఖల్లో కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేస్తూ.. 4గురికి నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అందరూ సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇంచార్జ్ డిఆర్ఓ మురళీ కృష్ణ, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్,  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు