నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నేక్) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువతకు ఉపాధి కొరకు ఎలక్ట్రీషియన్ కోర్సులో 'ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0' పథకం కింద ఎలక్ట్రీషియన్ కోర్స్ లో ఉచిత శిక్షణ, ఉపాధి నిమిత్తము నేరుగా దరఖాస్తులు కోరుతున్నట్లు నేక్ సహాయ సంచాలకులు రవికుమార్ తెలిపారు. అభ్యర్థులు 10 వ తరగతి పాసై 15 సం. నుండి 45 సం.ల వయసు కలవారే ఉండాలన్నారు. సుమారు 2 నెలలు శిక్షణా కాలం ఉంటుందని తెలిపారు. 60 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మాకవరపాలెం "నేక్" శిక్షణా కేంద్రంలో శిక్షణ, స్టేషనరీ ఉచితముగా అందజేయబడుతుందన్నారు. శిక్షణ నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో వుంటుందని శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత రంగంలో (ప్రైవేటు సెక్టారులలో) ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని వివరించారు. ఆశక్తి గల అభ్యర్థులు 7780275922 లేదా 9394885164 ఫోన్ నెంబరులో సంప్రదించాలన్నారు.