ప్రతి వ్యక్తి విజయానికి గురువే మూలం..కలెక్టర్


Ens Balu
43
Anakapalle
2023-09-05 14:38:44

ఏ ఒక్కరి విజయంలోనైనా గురువే ప్రముఖంగా కనిపిస్తారనీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అన్నారు.  మంగళవారం గుండాల వద్ద గల సచివాలయ సమావేశ మందిరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించిన  గురుపూజోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఏ రంగంలోనైనా ఏ స్థాయిలోనైనా గురువుకు ప్రథమ స్థానం ఉంటుందన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో టీచర్లు బాధ్యతగా పనిచేస్తున్నారని ప్రశంసించారు అయితే అందరూ ఆధునిక పరిజ్ఞానంతో అప్డేట్ అవ్వాలన్నారు.  మారుతున్న ఆధునిక కాలంతోపాటు మనము సాంకేతికతను సొంతం చేసుకోవాలన్నారు.  పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా అందరి మదిలో గురువుకు గౌరవ స్థానం ఉంటుందని చెప్పారు.  సమాజం యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం ఒక్క గురువు వల్లే సాధ్యమవుతుందన్నారు.  మన దేశ రెండవ రాష్ట్రపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతిగా చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 63 మందిని సన్మానించి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు బాలబాలికల ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, వైసిపి గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె. విష్ణుమూర్తి,డిప్యూటీ డిఇఓ  వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు