జెడ్సీలు వార్డు సచివాలయాలు సందర్శించాలి..


Ens Balu
4
జివిఎంసీ ప్రధాన కార్యాలయం
2020-09-28 19:55:14

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాలను  వారంలో రెండు రోజులు జోనల్ కమిషనర్లు సందర్శించాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన జెడ్సీలను ఆదేశించారు. సోమవారం జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయం నుండి జోనల్ కమిషనర్లు మరియు వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోనల్ కమిషనర్లతో పాటు, వార్డు ప్రత్యేక అధికారులు  వారంలో రెండు రోజులు సచివాలయమును సందర్శించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తీ స్థాయిలో సేవలను అందించాలని ఆదేశించారు.  అదే విధంగా సిబ్బంది హాజరు తో పాటూ ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను తనిఖీ చేసి వారికి పలు సూచనలు, సలహాలు జారీ చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకురావడానికి కమిషనర్ దృష్టికి తీసుకు రావాలని కమిషనర్ ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో జి.వి.ఎం.సి. అధికారులు మరియు అన్ని జోనల్ కమిషనర్లు, వార్డు  ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.