అసంబద్ధ సత్తువ లేని కేసులతో చంద్ర బాబు నాయుడు ప్రభంజనాన్నిఅడ్డుకోలేరని ఎమ్మెల్సీ దువ్వా రపు రామారావు అన్నారు. శుక్రవారం విశాఖ లోని ఆడారి కిషోర్ కుమార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు పై పెట్టిన కేసుల్లో సత్తువ లేదన్నారు. పాలకులు చూపించిన పైత్యానికి అధికారులు నిబంధనలు తుంగలోకి తొక్కడం క్షమార్హం కాదన్నారు. త్వరలోనే ప్రజలు వీళ్ళకి బుద్ది చెప్తారన్నా రు. ఉత్తరాం ధ్ర ను అభివృద్ధి చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి 2 చీకటి జిఓలు విడుదల చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ను వీళ్ళు కొత్తగా అభివృద్ధి చేయడం ఏంటని.. సహజ సిద్ధంగా వనరులున్న ఉన్న ఉత్తరాంధ్ర ను దోచుకోడానికి అధికార ఆర్ట్ వేసిన కుట్రగా అభివర్ణించారు. విశాఖ రాజధాని వద్దు అనే నినాదం తో ఈ సభల్లో తీర్మానం చేస్తున్నారన్నారు. చంద్రబాబుపై జగన్ పెట్టిన అక్రమ కేసులు నేడు సుప్రీం కోర్టులో కొట్టి వేయడం ద్వారా న్యాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రసీ ఇన్ డేంజర్ పేరిట అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, విద్యావేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం ర్వహిస్తు న్నామని చెప్పారు. ఆదివారం అరకు, పాడేరు ల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గత నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, అసుర పాలన తో పౌరుల నుంచి ప్రతిపక్షాల వరకూ అందరూ విసిగిపోయారన్నారు జనసేన మెడికల్ సెల్ ప్రతినిధి డా.బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ, జనసేన టీడీపీ సంయుక్తంగా పోటీ చేసి రానున్న ఎన్నికలలో ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. గత నాలుగున్నర ఏళ్ళల్లో విశాఖ పై లేని ప్రేమ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో కంచర పాలెం తెలుగు దేశం వార్డ్ అధ్యక్షులు గోర్లే అప్పారావు, కుట్ట కార్తిక్ తదితరులు ల్గొన్నారు.