ఏలూరులో ప్రారంభమైన మేరీ మట్టి మేరీ దేష్ కలశయాత్ర


Ens Balu
23
Eluru
2023-10-28 03:31:59

ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం మేరీ మట్టి మేరీ దేష్  అని డిఆర్వో వెంకేటశ్వ ర్లు పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా నుంచి కలస యాత్రను ఆయన జండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  స్ఫూర్తిని కలిగిస్తూ..భావి తరాల వారిలో దేశభక్తి పెంపొందించడానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ , జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో మేరీ మట్టి మేరీ దేష్ కలశయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లా నుండి 29 మంది వాలంటీర్లతో దేశ రాజధాని ఢిల్లీ పయనమైనట్టు తెలియజేశారు. 547 గ్రామ పంచాయతీల నుండి సేకరించిన మట్టితో మండల వారీగా ఏర్పాటు చేసిన కలశాలతో ఏలూరు జిల్లా నుంచి 36 మంది విజయవాడ నుంచి ప్రత్యేక ట్రైనులో వాలంటీర్లు ఢిల్లీ చేరుకుంటారన్నారు.  ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ 30, 31న రెండు రోజులు జరుగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.  జిల్లా నుంచి బాషా సాంస్కృతిక శాఖ, యువజన శాఖ, పంచాయతీ రాజ్ సమన్వయంతో అమృత కలశ యాత్ర చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జిల్లా యువజన అధికారి కిషోర్, సెట్వెల్  సీఈఓ మహారాజ్ వ్యవహరించగా అమృత కలశ యాత్రలో డిపిఆర్సీ, సెట్వెల్, యువజన కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా పంచాయతీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.