విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్పందించిన సీఎం


Ens Balu
6
Visakhapatnam
2023-11-02 12:44:39

 విశాఖలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ కు వినతి పత్రం అందజేశారు. విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి ని గురువారం ఉదయం ఐటీ హిల్స్ హెలిప్యాడ్ వద్ద సొసైటీ గౌరవ అధ్యక్షులు కే.జి.రాఘవేందర్ రెడ్డి, అధ్యక్షులు బి . రవికాంత్ లు కలిసి తమ సొసైటీ ద్వారా రిజిస్టర్ అయిన అక్రిడేటెడ్ జర్నలిస్టుల వివరాలను ఆయనకు అందజేశారు. ఈ ఏడాది అక్రిడేషన్ ఉన్నజర్నలిస్టుల వివరాలు, 2006 నుంచి 2022 వరకు వివిధ సంవత్సరాల్లో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల వివరాల జాబితాను ఆయనకు అందజేశారు. సుమారు 18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.  దీనిపై ముఖ్యమంత్రి జగన్  సానుకూలంగా స్పందించారు.  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి కి సూచించారు.  విశాఖలో ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు  కె.మురళీ కృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.