ఎంవిఆర్(ముత్యాల వెంకటేశ్వర్రావు).. ఈ పేరు చెప్పగానే ఇపుడు అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ఒకే రకమైన భారీ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈయన రాజకీయ రంగప్రవేశంపై ప్రచారం తారాస్థాయికి చేరింది. దీనితో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు ఈయనను వారి వారి పార్టీల్లోకి రావాలని ఆహ్వానాలు పంపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇంటెలి జెన్స్ నివేదికులు కూడా అన్ని రాజకీయపార్టీలకు చేరుతున్నాయి. దానికి కారణం ఒక్కటే అధికారం, ధనబలం, కులబలం,నెట్వర్క్ ఉన్న నేతలే ప్రజల కోసం ఆలోచి, ప్రజాప్రతినిధులు చేపట్టని సేవా కార్యక్రమాలు, ప్రజల్లోకి అతి తక్కువ కాలంలోనే వెళ్లిపోవడమే. తన సేవా కార్యక్రమాల కోసం ఏకంగా ఒక ట్రస్టునే ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటితోపాటు, ఆలయాల నిర్మాణం, గ్రామాల్లో జాతర నిర్వహణలకు సహకారం, యువతను క్రీడారంగంలో ప్రోత్సహించడానికి టోర్నమెంట్లు, స్పోర్ట్స్ కిట్లు అందజేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసే సేవాల కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. దానికితోడు కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు, ఇతర నేతలతో చాల సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ప్రతినిత్యం ఈయన ద్వారా సేవలు పొందే వారు అంటున్న మాట ఒక్కటే.. చాలా మందిని చూశాం..కానీ ఎలాంటి అధికార వ్యామోహం లేకుండా, నిరుపేదలను ఆదుకోవడం, ఆద్యాత్మిక కార్యక్రమాలకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ప్రజల్లో నిలబడే వ్యక్తును చాలా తక్కువగా చూస్తున్నామని అంటున్నారు.
సాధారణ సేవకుడిగానే ఇంత ముందు చూపుతో ప్రజలకు ఉపయోగ పడే పనులు చేపడితే ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టినా, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిస్తే మరిన్ని సేవలు ఎంవిఆర్ ద్వారా అందుతాయనే టాక్ ఇపుడు జిల్లాలో బలంగా నడుస్తుంది. ఎక్కడైనా ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి వస్తున్నారంటే అధికారపార్టీ నేతలు, వారి అనుచరులు వారి దగ్గరకు పరుగుతు పెడతారు. కానీ ఏ ప్రాంతానికైనా ఎంవిఆర్ వస్తున్నారని తెలిస్తే స్వచ్చందంగా ప్రజలే ఆయనను కలుసుకోవడానికి వస్తున్నాంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం వయసు మళ్లిన మహిళలకు దైవ దర్శనాలు కల్పించడానికి ఎంవిఆర్ ట్రస్టు ద్వారా తీర్ధ యాత్రల సేవ చేస్తున్నారు ఎంవిఆర్. దానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇవి కాకుండా జిల్లాలో ఏ గ్రామంలో కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నా, జాతరలు జరుగుతున్నా, క్రీడా పోటీలు జరుగుతున్నా.. ఈయన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయాలు కూడా అందుతున్నాయి. ఇలా అందరివాడిగా..ప్రజా నేతగా ఎంవిఆర్ అపుడే ప్రజాప్రతినిధి అయిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఇంతలా సేవచేస్తున్న వ్యక్తి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో, మంత్రిగానో అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వేరేగా చెప్పాల్సి పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఈయన రాజకీయ రంగ ప్రవేశంపై అన్ని రాజకీయపార్టీలు విస్త్రుతంగా ఎంవిఆర్ కోసం చర్చిస్తున్నాయి. చూడాల త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్న ఎంవిఆర్ ఏ పార్టీ ద్వారా తన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనేది..!