తడి-పొడి చెత్త వేరు చేయించాల్సిందే..


Ens Balu
5
Tirupati
2020-09-28 20:25:35

వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్క సెక్రెటరీలు రెండు మెయిన్ రోడ్డు గుర్తించి వాటిని బ్యూటిఫికేషన్ చేసే  విధంగా చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సంస్థ కార్యాలయంలో లలిత కళా ప్రాంగణంలో వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.  ప్రతి సెక్రెటరీ ఇంటింటి నుండి యూజర్ చార్జీలు కలెక్ట్ చేయాలన్నారు. సెక్రటరీలు స్పాట్ ఫైన్ వేయాలని, రోడ్డుపై, పబ్లిక్ స్థలాల్లో, కాలవలో చెత్త వేసిన వారికి మరియు నగరంలో ఇక్కడైనా మల మూత్ర విసర్జన చేసే వారికి అపరాధం వెయ్యాలని ఆదేశించారు. సి.ఎం.డి వేస్ట్ భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్ లో గాని బయట ప్రాంతాల్లో గాని, నగరంలో వేసిన వాటిని భారీ అపరాధం విధించి మరియు బండ్లు సీజ్ చేయాలని వాటిని కంపోస్ట్ యాడ్లో తరలించి అని, సి.ఎం.డి వేస్ట్ యాప్ ద్వారా సెక్రటరీలు కలెక్షన్ చేయాలన్నారు. నగరంలో ప్లాస్టిక్ వాడకం ఉంటే కఠినంగా వ్యవహరించాలని వారికి అపరాధం విధించి చర్యలు తీసుకోవాలని, ఇంటింటి నుండి తడి, పొడి చెత్తను వేరు చేయాలని అలా చేయని వారికి అపరాధ రుసుము విధించాలని సూచించారు. ప్రతి వ్యాపారస్తులు రెండు బీన్స్ ఉంచి చెత్త అందులో వేరు చేసి ఉంచాలి అలా లేనిచో పెనాల్టీ వేయాలి, హోం కంపోస్ట్ ప్రతి సెక్రెటరీ తన పరిధిలో 150 ఇంట్లో హోం కంపోస్ట్ తయారు చేయించాలి, కాలువల యందు ప్రస్తుతం100 చెత్త తీసే గ్రీన్స్ ఉన్నాయని, పెద్ద కాలువలో ఎక్కడ  ఏర్పాటు చేయాలి వాటి ప్రకారం ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలన్నారు.  స్లీపింగ్ ప్లానింగ్ ప్రకారం మెయిన్ రోడ్డు, వ్యాపార స్థలాలు, వీధుల్లో పలు ప్రాంతాలలో ప్రతిరోజు రెండు పూటలా శుభ్రం చేయించాలి, కాలువలకు అండర్ డ్రైనేజీ కనెక్షన్లు వాటిని గుర్తించి,వాటిని తొలగించి     యు జి డి కలెక్షన్ ఇప్పించాలన్నారు.  శానిటరీ సెక్రటరీలు ప్రతిరోజు మస్థర్ లకు వెళ్ళాలి, మైక్రో ప్యాకెట్ వేరుగా వర్కర్లను సరిచూసుకొని వారిలో పనులు చేయించాలి, పది రోజుల లోపల 10 కొత్త ఆటోలు వస్తాయని పని భారం తగ్గుతుందని, బాగా పని చేసే వాళ్ళకి కలెక్టర్ ద్వారా ప్రశంసా పత్రాలు ఇప్పిస్తామని, పని చేయకుండా తిరిగే వాళ్ళకి మొదటగా షోకాజ్ నోటీస్ ఇస్తామని, రెండు, మూడు సార్లు ఇలానే జరిగితే విధుల్లో నుంచి తొలగించి ప్రభుత్వానికి తెలియజేస్తామని, గతంలో ప్రతి ఇంటికి గేట్ స్కానింగ్ చేయడం ద్వారా 90% పని చేస్తా ఉన్నారు నేడు 60% వచ్చిందంటే మీ పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది అని అసహనం వ్యక్తం చేశారు, వర్షాకాలం కాబట్టి ప్రతిరోజు దోమలు మందు కొట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి,శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రిలు, హెల్త్ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.