విశాఖ స్టీల్ ఉద్యమాన్ని దేశ రాజధానికి తీసుకు వెళదాం: ఆడారి కిషోర్ కుమార్


Ens Balu
34
Visakhapatnam
2023-11-08 14:13:19

 విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదిక గా ఉద్యమించి కేంద్రానికి విశాఖ ఉక్కు సత్తా చాటుదామని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు  

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం 1000 రోజులు దాటిన సందర్భంగా బుధవారం విశాఖ స్టీల్ పోరాట శిబిరం వద్ద జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఆడారీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపి లు కచ్చితంగా ఉద్యమానికి అండగా నిలబడాలని ప్రకటించారు లేని పక్షంలో వాళ్లని ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదన్నారు ఉద్యమకారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారి ఉద్యమానికి అండగా నిలబడతామని తెలియజేశారు.

ఢిల్లీ లో  వైజాగ్ స్టీల్ ఉద్యమ పోరాటాన్ని ఉధృతం చేస్తే. కేంద్రానికి వేడి పడుతుందన్నారు. తెలుగు వారితో పాటు, ఉత్తర భారత దేశ వాసుల మద్దతు కూడా లభిస్తుందన్నారు.

ఈ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.