మత్సకారులకు అండగా ప్రభుత్వం- జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు


Ens Balu
94
Vizianagaram
2023-11-21 13:57:24

 మత్స్యకారులకు భారోసానిస్తూ ఎల్లపుడు ప్రభుత్వం అండగా నిలుస్తోందని   జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు.  మత్స్య సంపదను పెంచడానికి, మత్స్యకారులకు మత్స్య  వ్యాపారాలను సజావుగా చేసుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి అనేక పధకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని  మంగళవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మత్స్యకారులకు సందేశాన్ని అందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ను కలెక్టరేట్ నుండి  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్,  రాజాం శాసన సభ్యులు  కంబాల జోగులు, మత్స్య శాఖ డి డి నిర్మలా కుమారి, మత్స్యకార సంఘాల ప్రతినిధులు బర్రి చిన్నప్పన్న, ఇతర లబ్దిదారులు తిలకించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణ లో  32 మంది లబ్ది దారులకు  24 లక్షల విలువైన ద్వి చక్ర వాహనాలను  అందజేసారు. వీరిలో 6 గురు మహిళా లబ్దిదారులు ఉన్నారు. అదేవిధంగా ఎస్.సి వర్గానికి చెందిన ఇద్దరు లబ్దిదారులకు 33,29,798 లక్షల విలువైన రెండు  ఫిష్ సీడ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను    అందజేశారు.  అదే  విధంగా 20 లక్షల విలువైన్స్ ఇన్సులేటెడ్ వాహనాన్ని అందించారు.  ఈ మొత్తం వాహనాల విలువ 84 లక్షలు కాగా  అందులో లబ్దిదారుని వాటాగా 44,60,000   రూపాయలు , ప్రభుత్వ సబ్సిడీ గా 39,40, 000 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు.   వాహనాలను లబ్దిదారులకు జిల్లా పరిషత్ చైర్మన్ , జే సి చేతుల మీదుగా అందజేసారు. 
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మీడియా తో మాట్లాడుతూ  మత్స్య  కార వృత్తి పైనే ఆధార పది, మత్స్య వ్యాపారాలు చేసే వారికి  ప్రభుత్వం అనేక రకాలుగా ఉపకరణాలను అందించడమే కాకుండా వేట నిషేద సమయం లో  ఒక్కో మత్స్యకార కుటుంభానికి 10 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం  భ్రుతి కల్పిస్తుందని పేర్కొన్నారు.  ఫిష్ ఆంధ్ర పేరుతో లైవ్ ఫిష్ ను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడం  ద్వారా ఇటు వినియోగ దారునికి, అటు మత్స్యకారునికి  లబ్ది జరుగుతోందని తెలిపారు.  ఈ నెల్ 20 న విశాఖపట్నం  లో జరిగిన బోటు ప్రమాదం లో నష్ట పోయిన వారికీ 80 శాతం వరకు ప్రభుత్వమే ఇన్సురెన్సు ను భరిస్తోందని తెలిపారు.    మత్య్సకారులకు మెరుగైన జీవనోపాది, భద్రత కు భరోసా నివ్వడమే కాకుండా  మత్స్య రంగం లో ఎదుర్కొటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఆదుకోవడం జరుగుతుందన్నారు.