వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రక్షాళన దిశగా సమిష్టి కార్యాచరణకై అడుగులు వేస్తున్నామని, దానికి విశాఖలో విజెఎఫ్ సభ్యులంతా కలిసి రావాలని కోశాధికారి అభ్యర్ధి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరో చీఫ్, పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం విజెఎఫ్ లో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజెఎఫ్ నిబంధనలకు విరుద్దంగా, కోర్టు కేసుల నెపాన్ని సాకుగా చూపి కాలం చెల్లిన కార్యర్గం అనధికారింగా పాలిస్తూ వచ్చిందన్నారు. దీని వలన ఎందో సీనియర్ జర్పలిస్లులు విజెఎఫ్ సభ్యత్వానికి కూడా నోచుకోకుండా పోయారన్నారు. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఆర్వర్వంలో ఫైవ్ కమిటీ, ఎన్నికల అధికారిని నియమించి స్వయంగా చేపడుతున్న ఎన్నికల్లో పోటీ పడుతున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా సభ్యులంతా సమిష్టిగా పనిచేసి విజెఎఫ్ ను అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని కోరారు. ఇన్నేళ్ల కాలంలో విజెఎఫ్ కి ఒక్కరూపా ఆస్తికూడా పెరగలేదని, వచ్చిన ఆదాయం కూడా సంక్షేమం పేరట అధిక ఖర్చుల రూపంలోనే సభ్యులకు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా సొసైటీ నిబంధనలను, బైలానిబంధనలు పక్కన పెట్టి పాలించి, సభ్యులను మభ్య పెట్టిన పాత కార్వవర్గానికి అభ్యర్ధుల ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపు నిచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో రాజ్ న్యూస్ రిపోర్టర్ సుంకరిసూర్యం, సాక్షి టివిబ్యూరో రాచంద్రరావు, పబ్లిక్ బ్యూరో యర్రా నాగేశ్వర్రావు, మహాటివి బ్యూరో జి.శ్రీనివాసరావు, మనభూమి ఎడిటర్ సత్యన్నారాయణ, నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ పరశురామ్,వార్త ఇస్రయేల్, రమణ, తదితరులు పాల్గొన్నారు.