గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-3


Ens Balu
3
Amaravati
2020-09-29 07:56:45

ఆంధ్రప్రదేశ్ లో గ్రామసచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగా మారడానికి కారణం జిల్లా పంచాయతీ అధికారులు మాత్రమే అనే విషయం తేట తెల్లమవుతుంది. గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏకంగా లక్షా 10 వేల ఉద్యోగాలను భర్తీచేస్తే అందులో అగ్రభాగం నూతనంగా చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలే. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలకు ముఖ్య అధికారులు వీరంతా. అలాంటి అధికారులకు ఎలాంటి అధికారాలు లేకపోతే వీరు విధుల్లో చేరి ఏం లేభమో జిల్లా అధికారులే చెప్పాల్సి వుంది. కాదు కాదు డిపీఓ ఆదేశాలను ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు పట్టించుకోలేదనే విషయం చాలా క్లియర్ గా స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామసచివాలయాల్లో నూతన కార్యదర్శిలకు జిఓఎంఎస్ నెంబరు 149 ద్వారా విధులు, అధికారాలు బదలాయించాల్సి వుంది. కానీ వారికి అధికారాలు, బాధ్యతలు అప్పగించడానికి సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలకు చేతులు రావడం లేదు. అంతేకాదండోయ్ జిల్లా పంచాయతీ అధికారులు ఇచ్చిన లిఖిత పూర్వక ఆదేశాలను సైతం వీరు అమలు చేయడంలేదంటే దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిఓఎంస్ నెంబరు 149 ప్రకారం ప్రభుత్వం నిర్ధేశించిన సచివాలయాల పరిధిని, అధికారాలను వారికి అప్పగించాల్సి వుంది. కాని సచివాలయ వ్యవస్థ ఏర్పాటై 11 నెలలు గడుస్తున్నా.. ఎలాంటి అధికారాలు లేని గ్రామకార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగా ప్రభుత్వం వీరికి ఏం అధికారాలు కట్టబెట్టిందో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా విధులు నిర్వహిస్తున్నారు.  జిల్లా పంచాయతీ అధికారులు జిఓఎంఎస్ నెంబరు 149 ప్రకారం అధికారాలు బదలాయించాలని మెమోజారీచేసి వారి చేతికి మట్టి అంటకుండా చేతులు దులిపేసుకున్నారు. వాటిని అమలు చేయించాల్సిన ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు అదేదో పనికిరాని మెమో అన్నట్టు, 149 జీఓ అంత అర్జెంటుగా అమలు చేయాల్సిన పనిలేదన్నట్టుగా పక్కన పడేయడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వున్న కార్యదర్శిలకు అధికారాలేంటో తెలియడం లేదు. దీంతో ఎపుడైనా జిల్లా కలెక్టర్, గ్రామసచివాలయశాఖ జెసిలు పర్యటనకు వచ్చినా కార్యదర్శిలు అధికారులతో చివాట్లు తినాల్సి దుస్తితి ఏర్పడుతుంది. సీనియర్ కార్యదర్శిలంతా ఈ నూతన గ్రేడ్ 5 కార్యదర్శిలను, సహచర కార్యదర్శిలుగా కాకుండా కార్యాలయ సహాయకులగా చూస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుందని విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సచివాలయ పరిధిలోని అధికారాలు, రికార్డులు, బ్యాంకు ఖాతాలు, డిడిఓ అధికారాలు మాకు అప్పగించండి మహాప్రభో అని జిల్లా పంచాయతీ అధికారికి మొరపెట్టుకొని మూడు నెలలు గడుస్తున్నా...డిపిఓ జారీచేసిన మోమో వచ్చి రెండు నెలలు గడుస్తున్నా అధికారాలు బదలాయింపు మాత్రం జరగలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామకార్యదర్శిలంతా ఇపుడు జిల్లావారీగా ఏకమై డిపిఓను, జిల్లా కలెక్టర్లను కలిసే యోచన చేస్తున్నారు. అసలు జిఓనెంబరు 149 ఖచ్చితంగా ఎందుకు అమలు చేయమని చెప్పలేకపోతున్నారనే విషయం రేపటి గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-4లో చూడవచ్చు..!