మొక్కల సంరక్షణ సామాజిక భాద్యత..
Ens Balu
4
Vizianagaram
2020-09-29 12:32:02
మొక్కలను సంరక్షించడం సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. మనకోసం, మన భవిష్యత్ తరాలకోసం ప్రతీఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. హరిత విజయనగరం సాధనలో భాగంగా పట్టణంలోని తోటపాలెం బ్యాంకు కాలనీ, మున్సిపల్ పార్కులో మంగళవారం ఉదయం మొక్కలను నాటారు. అంతకుముందు మూడు రోజులనుంచీ ఈ పార్కును శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మొక్కలను నాటి, ట్రీగార్డులను అమర్చారు. అవి పెరిగే వరకూ కొన్నాళ్లపాటు ఆ మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రతీరోజూ నీళ్లుపోయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, డిఎఫ్ఓ ఎస్.జానకిరావు, ప్లాంటేషన్ రవి, డాక్టర్ వెంకటేశ్వర్రావు, స్థానికులు పాల్గొన్నారు.