స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఎన్టీఆర్, నందమూరి అభిమానుల సేవలు మరువలేనివని యువ నాయకులు , డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ అన్నారు. గవరపాలెం లోని శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సొంత డబ్బులు వెచ్చిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఘతన ఒక్క నందమూరి అభిమానులకే దక్కుతుందన్నారు. నందమూరి అభిమానులు చేపట్టే ఏ కార్యక్రమానికైనా తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారన్నారు. నందమూరి బాలకృష్ణ,నారా భువనేశ్వరి , లోకేష్ తోపాటు బ్రాహ్మణి కూడా స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజా సంక్షేమానికి ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. అనకాపల్లి అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమని..అందుకే ఒక లెక్చరర్‌గా పనిచేసే దాడి వీరభద్రరావు కి ఎమ్మెల్యే పదవి తో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి పదవి కూడా ఇచ్చి అనకాపల్లికి దేశంలో మంచి గుర్తింపు వచ్చేలా చేశారన్నారు. దీంతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హయాంలో అనకాపల్లిలో ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ వైద్యాలయం, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డు, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ రింగురోడ్డు, ఎన్టీఆర్ రక్షిత మంచినీటి పథాకాలు వంటి అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్టీఆర్ సతీమణి బసరతారకం పేరుతో వెంకుపాలెం వద్ద వంతెన, బసవరామతారక కాలనీ (బీఆర్‌టీ) ఇలా కలకాలం నిలిచిపోయే కట్టడాలను నిర్మించి ఎన్టీఆర్ రుణం తీసుకొనే అవకాశం వచ్చిందన్నారు. ఆయన తో ఉన్న అనుబంధాలను, అనుభవాలను ఈ సందర్భంగా రత్నాకర్ వివరించారు. అనందరం అభిమానులు రత్నాకర్ ని శాలువా లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొణతాల బాల, కరణం శ్రీనివాసరావు, కర్రి దివాకర్, చౌదరి, పొలిమేర నాయుడు, నాగు, తవుడుబాబు, పెతకంశెట్టి శ్రీను, అధికసంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.