అనకాపల్లి పార్లమెంటు స్థానానిక ఎంపీ అభ్యర్ధిగా తనపేరును ప్రతిపాదించాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ బుద్దానాగజగదీష్ కు ఆడారి కిషోర్ కుమార్ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి అభ్యర్ధించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సూచనలు, సలహాల మేరకు నడుచుకుంటూ యువజనవిభాగంలో కష్టపడి పనిచేస్తున్నానని, ఈ ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పిస్తే తనను తాను నిరూపించుకుంటానని అన్నారు. యువతతోపాటు, పార్లమెంటు నియోజవర్గంలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలలో టిడిపి, జనసేన యువత మద్దతు కూడా అభ్యర్ధిస్తున్నట్టు కిషోర్ కుమార్ బుద్దా దృష్టికి తీసుకొచ్చారు. ఆడారి అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన జిల్లా అధ్యక్షులు పార్టీ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆడారి కిషోర్ వెంట పలువురు టిడిపి నాయకులు, యువజనవిభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.