జడ్డు వాసుదేవరావు మృతి ప్రభుత్వ హత్యే.. టిడిపి నేత ఆడారికిషోర్ కుమార్


Ens Balu
335
Anakapalle
2024-01-09 08:27:17

సర్వశిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 21రోజుల పాటు ఆందోళన చేస్తూ అకస్మాత్తుగా మృతిచెందడం చాలాదారుణమని టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనకాపల్లి డిఈఓ కార్యాలయం వద్ద సర్వశిక్షాఉద్యోగులు, మృతిచెందిన వాసుదేవరావుతో మృతదేహంతోపాటు ఆయన కూడా ఆదందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, సర్వశిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎంటిఎస్ గా చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ల సాధన కోసం పోరాటం చేసే ఉద్యోగి మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇంకా ఎంతమందిని బలితీసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తోందో ప్రకటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ, ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించేంతవరకూ ఉద్యోగుల ఉద్యమానికి, పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. వాసుదేవరావు మృతిపై డిఈఓ సమాధానం చెప్పాలని, ఆందోళన చేపడుతున్న సర్వశిక్ష ఉద్యోగి మృతిపైపోలీసుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది ప్రభుత్వ హత్యగానే భావించి ఆందోళన ఉదృతం చేయాలన్నారు. ఈ విషయాన్నిఇంటెలిజెన్స్ సంస్థలు కూడాప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతుని కుటుంబానికి ఆసుపత్రికి అయిన రూ.10లక్షలతోపాటు, తమ కుటుంబ పెద్దను కోల్పోయినందుకు కూడా నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వశిక్షా ఉద్యోగుల ఉద్యమానికి రాజీలేని మద్దతు ఇస్తామని పునరుద్గాటించారు. అనంతరం బయటకు వచ్చిన డిఈఓ తో జరిగినవిషయంపై గట్టిగా చర్చించారు. డిఈఓ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయినా ఆమాటలకు అంగీకరించని కిషోర్ మృతదేహంతోనే జాతీయ రహదారిపై బైటాయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆడారి కిషోర్ యువసేన ప్రతినిధులు, అధిక సంఖ్యలో సర్వశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.