రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, తాగునీటి విభాగపు సిబ్బంది, సమ్మెలో పాల్గోన్నందున నగరంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, పారిశుధ్య సేవలు అందిం చడంలో ఆటంకం కలుగుతున్న దృష్ట్యా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ లతో కలసి జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని ఆమె చాంబర్లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, జివిఎంసి బడ్జెట్ సమావేశం అనంతరం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పారిశుధ్య నిర్వహణపై చర్చలు జరిపి, వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే నగర పరిధిలో పారిశుద్ధ కార్మికులు, తాగునీటి విభాగం సిబ్బంది సమ్మె కారణంగా నగరంలో పారిశుధ్య పనులకు, తాగునీటి సదుపాయానికి అంతరాయం కలుగుతున్నందున జివిఎంసి యంత్రాంగం ప్రత్యేక చర్యల ద్వారా తాత్కాలికంగా పారిశుధ్య సిబ్బందిని వ్యర్దాలు తరలించుటకు ప్రైవేట్ వాహనాలను అలాగే జివిఎంసి కి చెందిన సొంత వాహనాలు, జివిఎంసి పర్మినెంట్ పారిశుధ్య సిబ్బందిని ఉపయోగించి పారిశుధ్య నిర్వహణ పనులు చేపడుతుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున ప్రభుత్వం సానుకూల వాతావరణంలో కార్మికులతో చర్చలు జరుపుతున్నందున అవి ఫల ప్రథమవుతాయని అంతవరకు నగర ప్రజలకు అంతరాయం కలుగకుండా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు పారిశుధ్య కార్మికులు నగర పరిశుభ్రతకు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.