సూడు సెగరెట్రీ మడిసన్నాక కుసింత కళాపోసనుండాల.. ఉట్టినే తినితొంగుంటే మడిసికి..గొడ్డుకీ పెద్ద తేడా ఏటుంటాది..! ఈ ఎవర్ గ్రీన్ డైలాగ్ ఎవరిదో తెలుసా..? నటవిరా ట్ రావుగోపాలరావు ది..ముత్యాలముగ్గు సినిమాలో ఈ డైలాగ్ చాలా పాపులర్..బహుసా ఆ డైలాగే తాను కూడా ఉద్యోగం చేస్తూనే కళారంగంలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని మహా మహా సీనీ నటులు, టీవి ఆర్టిస్టులూ, మ్యూజిక్ డైరెక్టర్లతో మంచి మంచి పరిచాయాలు పెంచుకున్నారు జివిఎంసీ పీఆర్వో నాగేశ్వర్రావు. దానిని కూడా తన విధినిర్వహణకోస, సమాజ సేవకోసమూ వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. కళారంగంలోనూ, టీవిరంగంలోనూ మంచి మంచి కార్యక్రమాలు రూపొందించి, జీవిఎంసీలో కూడా మంచి కళాకారులు ఉన్నారనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి పరిచియం కూడా చేశారాయన. ఈటీవిలో అప్పట్లో వచ్చిన కలర్స్.. అంధుల పాటల పోటీల కార్యక్రమం దేశంలోనే అత్యంత పాపులర్ అయ్యింది. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణను ఒప్పించి, అంధ కళాకారుల్లోని టాలెంట్ ని బయటకు తీసుకు రావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ కార్యక్రమానికి టైటిల్ సాంగ్ రాసి మంచి నాగేశ్వర్రావు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ తన జీవితమనే నాణేనికి ఒక వైపు విధినిర్వహణ అయితే మరోవైపు కళారంగంలో ఆరితేరాలనే తపన. ఈ క్రమంలోనే చాలా మంది సినీ, టీవి ఆర్టిస్టులతో విశాఖలోనూ చాలా కార్యక్ర మాలు చేయించారు. ఇవన్నీ తన విధినిర్వహణ పూర్తయిన తరువాతే. అయినా ఒక సాధారణ ఉద్యోగికి ఇంతటి స్థాయిలో సినీ, టివి రంగం ప్రముఖులతో పరిచియాలు ఉన్నాయంటే ఆయన సామర్ధ్యం ఏంటో ఎలాంటి వారికైనా ఇట్టే అర్ధమవుతుంది. ఇక సేవాకార్యక్రమాలంటారా నిశ్వార్ధంలో ఆయన కుడిచేతితో చేసిన దానాలు, ఎడమచేతికి తెలియకుండా చేస్తారు..ఇవన్నీ చెప్పడానికి ఒక కారణం కూడా ఉంది. ఏది నిజమో అధికారులకి, మీడియాలో చాలామందికి ఈయన కోసం తెలియాలి. తెలిస్తే ఈయనపై వచ్చే తేడా అసత్య ప్రచారాలకు చరమగీతం పలకాలి. పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తే అవే నిజం అనుకునే సందర్భాలూ వస్తాయి. అదే సమయంలో వాస్తవాలు కూడా బయటకు ఈ విధంగా వచ్చే ప్రమాదం అంతకంటే ఎక్కువుగా వుంటుంది.
ఏది నిజం..
వాస్తవానికి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా విధినిర్వహణ సమయంలో దానిని ప్రైవేటు కార్యక్రమాలకు వినియోగించరు. అలాంటి పీఆర్వో నాగేశ్వర్రావు సినీ కార్యక్రమాలు విధులకు ఎగనామం పెట్టి మరీ చేస్తున్నారని బురదచల్లే ప్రయత్నం చేస్తే..దానిని జివిఎంసి డైనమిక్ కమిషనర్ చూస్తే పీఆర్వోపై మండిపడతారనేది తెరవెనుక జీవిఎంసికి చెందిన కొందరు ఉద్యోలుగు, అధికారులే కొందరితో పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అయినా ప్రెస్టేషన్ ఉండొచ్చు కానీ..మీరి ఈయనకోసం పనిగట్టుకొని మరీ ప్రచారం కల్పించేటంత ప్రెస్టేషన్ ఉంటే ఎవరికి లాభమో అలాంటి ప్రచారాలు చూసేవారికి, చేసేవారికి, తెరవెనుక ఉండి చేయించేవారికి తెలియాలి. ఒక్కటిమాత్రం నిజం..అధికారుల మాట జవదాటని, పని పిశాచిలా విధినిర్వహనే పరమావధిగా భావించే పీఆర్వో విషయంలో ఎన్ని పావులు కదిపినా ఏమీ చేయలేవనేది సుస్పష్టం. కాస్త టేలంట్, మరికొంచెం సినిమా టచ్, టీవీ పరిచియాలు ఈయకు కాస్త ఎక్కువే వాటితోనే చాలా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఈయన దగ్గరుండి చేయించగలిగారు. స్వచ్చభారత్ కోసం సినిమా నటులు, రచయిత, స్వర్గీయ గొల్లపూడి మారుతీరావుతో ఈయన ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్ డాక్యుమెంట్ విశాఖ వాసులను ఎంతగానో ఆకర్షించింది. ఒక కార్యక్రమాన్ని ఈయనకున్న సినిమా, టివి పరిచాయాలకు ప్రజలు ఆలోచింపజేసే విధంగా చేయడంలో ఈయన దిట్ట. అలాంటి వ్యక్తిపై ఏదో వ్యక్తిగత ప్రయోజనాలు సమకూరలేదని, పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తే నమ్మేవారెవరున్నారు..? అనుకుంటాం గానీ..ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని..ఒక్క పేపర్ యాడ్ రాలేదనే ఒకే ఒక్క కారణం ఈయనపై ఇంతటి తప్పుడు ప్రచారాలకు కారణమైందంటే ఇక్కడ కూడా మళ్లీ మహేష్ బాబు సినిమా డైలాగ్ ఒకటి గుర్తొచ్చేస్తుంది... నన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు.. ఆ కన్ఫ్యూజన్ ఓ మరీ ఎక్కువగా కొట్టేస్తాను అంటాడు..సరిగ్గా ఇక్కడ కూడా అదే జరుగుతోంది. తన ఫాల్స్ ప్రెస్టేజ్ ప్రెస్టేషన్ గా మారి పీఆర్వో నాగేశ్వర్రావుకి ఉన్న సినిమా, టీవి టేలంట్ ను తన వార్తల తేడా ప్రచారాలకు కన్ఫ్యూజన్ కి వాడేస్తూ..ఎక్కడెక్కడి ఫేస్ బుక్ లోని ఫోటోలు బయటకు తీసేసి ప్రస్టేషన్ లో మరీ ఎక్కువ ప్రచారం కల్పించేస్తున్నారంటే ఏమనుకోవాలి.. మంత్రాలకు చింతకాయలు రాలవనే విషయం మరిచిపోయి, తప్పడు ప్రచారం చేసేస్తే అనుకున్న టార్గెట్ పూర్తవుతుందనుకుంటే.. చాలా కార్యక్రమాలు, పనులు జీవిఎంసీలో అయిపోవాలి. అందువలన చేత వృష్ణాయాసం..భజగోవిందం పనులు మానుకుంటే అందరికీ మంచిదంటున్నారు జివిఎంసీ ఉద్యోగులు, అధికారులు..ఏటంతారు..!?