జగనన్న తోడు కార్యక్రమం పథకం క్రింద విశాఖ జిల్లాలోని 23,639 మంది చిరు వ్యాపారులు లబ్ధిపొందారు. వృత్తి కళాకారులతో సహా చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆదాయాలను మరింత మెరుగుపరచేందుకు నిర్ధేశించిన జగనన్నతోడు 8వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీట నొక్కి నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 3.95 లక్షల మందికి రూ.418 కోట్లు కొత్తగా రుణాలను విడుదల చేయగా, గతంలో రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారి ఖాతాల్లో సున్నావడ్డీ క్రింద 5.80 లక్షల మందికి రూ,13.64 కోట్ల నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో ముఖ్యమంత్రి జమచేశారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం జిల్లాలోని అర్హులైన 23,639 మందికి రూ.60.72 లక్షలు వడ్డీ రాయితీని, అదేవిధంగా 17,469 మందికి రూ.18.48 లక్షల కొత్త రుణాల నమూనా చెక్కులను యుసిడి ప్రోజెక్ట్ డైరక్టర్ కె.వి.పాపినాయుడుతో కలిసి కలెక్టర్ అందజేసారు. కార్యక్రమంలో ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.