ప్రభుత్వ సమాచారం, సెలవులు పరిపాలన పరమైన ప్రాధాన్యత అంశాలతో కూడిన రెవిన్యూ డైరీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడాలని జిల్లా కలెక్టర్ డా.మల్లిఖా ర్జున ఆకాంక్షించారు. 2024 సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ డైరీని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన ఏడా దికి సంబంధించిన ప్రభుత్వ సెలవులు, ప్రముఖ రోజులు తదితర అంశాలతో ముద్రితమైన డైరీని జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, డీఆర్వో కె. మోహన్ కుమార్, ఆర్డీ వో హుస్సేన్ సాహెబ్ తదితరులతో కలిసి తన ఛాంబర్లో ఆవిష్కరించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం సంబంధిత డైరీలను వివిధ విభాగాల అధికారులకు, కలెక్ట రేట్లోని సెక్షన్ల సూపరింటెండెంట్లకు కలెక్టర్ డైరీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కార్యక్ర మంలో పాల్గొన్నారు.