మహా విశాఖనగర పాలక సంస్థ పరిధిలోని ప్రాధాన్యత పరమైన అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్టాండింగ్ కమిటీ చైర్మన్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. జివిఎంసి స్థాయి సంఘం సమావేశం శుక్రవారం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొందుపరిచిన అజెండాలో 38 అంశాలతో పాటు టేబుల్ అజెండాలో 17 అంశాలు పొందుపరచగా మొత్తంగా 55 అంశాలను సభ్యులు చర్చించి అన్ని అంశాలను ఆమోదించామన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.4.32 కోట్లు అభివృద్ధి పనులకు, ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి పలు కార్యక్రమాలకు, అదనపు కార్మికులను తాత్కాలికంగా సేవలు వినియోగించుకునేందుకు, ఇతర కార్యక్రమాల కోసం రూ.1.37 కోట్లు రెవెన్యూ విభాగానికి సంబందించి లీజులు పొడిగింపు, మొదలైన అంశాలతో ఆమోదించామన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో జాతీయస్థాయిలో విశాఖపట్నానికి 4వ ర్యాంకు వచ్చినందుకు సహకరించిన విశాఖ నగర ప్రజలకు, డిప్యూటీ మేయర్లకు, స్థాయి సంఘ సభ్యులకు, ఫ్లోర్ లీడర్లకు, కార్పొరేటర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు,జీవీఎంసీ అన్ని విభాగాల అధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు, నివాసిత సంక్షేమ సంఘ సభ్యులకు, స్వచ్ఛభారత్ అంబాసిడర్లకు, సినీ, క్రీడా ప్రముఖులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి నగర మేయర్ కు స్థాయి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి పి.నల్లనయ్య, డి.సి(రెవెన్యూ) ఫణిరామ్, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, 5వ జోనల్ కమీషనరు ఆర్.జి.వి.క్రిష్ణా, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ, కార్యనిర్వాహక ఇంజనీర్లు సంతోషి కుమారి, తారాప్రసన్న, రమణమూర్తి, అడ్మిన్ స్ట్రేషన్ ఆఫీసరు పద్మజ, ఉప కార్యనిర్వాహక ఇంజీనీరు, తదితరులు పాల్గొన్నారు.