కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు విస్త్రుతం చేయాలి


yv.ramanaji
21
Anakapalle
2024-01-12 14:22:32

అనకాపల్లి జిల్లాలో కార్మికులు, నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టంశెట్టి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో  నిర్వహించిన కోఆర్డినేషన్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులను ఉపయోగించుకుంటున్న అన్ని శాఖల వారి నుండి కార్మిక సెస్ వసూలు చేయాలన్నారు. అదేవిధంగా నిర్మాణాలకు సంబంధించి పని ప్రారంభించక ముందే సెస్ కట్టించుకోవాలన్నారు. భవనాలు కట్టడాల నిర్మాణాలను ముందుగానే రిజిస్టర్ చేయించాలన్నారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఏమైనా బిల్లులు పెండింగ్ ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు.  ఈ సమావేశంలో అసిస్టెంట్  కమిషనర్ ఆఫ్ లేబర్ వసంతరావు, సోషల్ సెక్యూరిటీ అధికారికి పి. సుజాత, గృహ నిర్మాణ శాఖ ఎస్ డి సి కే. రమాదేవి డ్వామా పిడి ఈ. సందీప్ జీవీఎంసీ జెడ్.సి. వెంకటరమణ, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, పరిశ్రమల శాఖ ఏడి తదితరులు పాల్గొన్నారు.