విశాఖ నగరానికి ఈ నెల 15న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేష్ బిధూరి ఛైర్మన్ గా వ్యవహరించనున్న ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరఫున 21 మంది లోక్ సభ నుంచి, 10 మంది రాజ్యసభకు చెందిన సభ్యులు మొత్తం 31 మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 16, 17వ తేదీల్లో పెట్రోలియం & నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులతో కమిటీ సభ్యులు సమావేశమై సంబంధిత అంశాలపై సమీక్షించనున్నట్లు వెల్లడించారు. స్టాండింగ్ కమిటీ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయవలసిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.