భోగిమంటల్లో పనికి రాని వస్తువులను వేస్తారని..గత 4 ఏళ్ల 9 నెలలుగా పనికిమాలిన ప్రభుత్వం ఏపీలో ఉందని..ఎందుకూ ఉపయోగంలేని వైఎస్సీర్సీపి పాలనను, పనికిరాని జీఓ లను కాల్చి బోగిమంట్లో వేయాలని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భోగి,మకర సంక్రాంతి పర్వదినాల సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ మునిగిపోతున్న నావలాంటి పార్టీ వైఎస్సార్సీపీ అని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ నుంచి సురక్షితంగా బయటపడటానికి అనేక మంది వీడిపోతున్నారని.. స్వపక్షంలో వున్న వారూ సతమతం అవుతున్నారని అన్నారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంబటి రాయుడు ఏదేదో ఊహించుకుని వైఎస్సార్సీపికి వెళ్లి ఏ స్కోరూ చేయకుండానే పెవిలియన్ దారిపట్టి జనసేన వైపు వెళుతున్నారన్నారు. ఉమ్మడి విశాఖజిల్లాలో ఏఒక్క స్ధానం కూడా వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం లేదని సర్వేలు వస్తున్నాయని అన్నారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లోకి రాబోతున్నారని.. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగుతాయని ప్రజల్లో విశ్వాసం పెరుగు తుందన్నారు. అనంతరం జీఓలను బోగి మంటల్లోవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి ఎర్నాగుల జగదీష్, జిల్లా ఉపాధ్యక్షుడు బోయి వెంకటరమణ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సతివాడ శంకర రావు పాల్గొన్నారు.