విశాఖపట్నం రైతు బజార్లలో గిరిజన రైతులకు స్టాల్స్ కేటాయింపు కోసం 27 న డ్రా తీయనున్నట్టు విశాఖ జెసి కె. విశ్వనాధన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2019 సంవత్స రం నుండి ఇప్పటి వరకు స్పందన ద్వారా, వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తులు చేసుకొని యున్న786 మంది రైతులలో 315 మంది రైతులకు డ్రా తీయవలసి యుండగా గిరిజన రైతులు హాజరు కానందున, 235 మందికి మాత్రమే 12న దరఖాస్తుదారుల సమక్షములో డ్రా తీశామన్నారు. మరోసారి బహిరంగంగా దరకాస్తుదారుల సమక్షంలో 233 జాబితా నుండి 80 మంది గిరిజన రైతులకు డ్రా తీయనున్నట్టు పేర్కొన్నారు. డ్రా తీయబోయే స్టాల్స్, ఇతర వివరాలు తెలుసుకొను నిమిత్తం www.visakhapatnam.ap.gov.in, లో పొందుపరచినట్టు తెలియజేశారు. ఎంపికైన రైతులు వారికి నామినీగా ఉన్నవారి యొక్క రక్త సంబందికులను మాత్రమే డ్రా లో పాల్గొనేందుకు అనుమతిస్తామన్నారు. రైతులు సాయంత్రం పూట రైతు బజార్లకు వెళ్లేందుకు అంగీకారం తెలపాల్సి వుంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సహాయ మార్కెటింగ్ ఏడి ఆఫీస్ గోపాలపట్నం రైతు బజార్ ప్రక్కన, లేదా ఫోన్:9959592474లో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.