ఉద్యోగుల గ్రీవెన్స్ దరఖాస్తులను సంబంధిత జిల్లాశాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలనే జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటించాలని కలెక్టరేట్ కార్యాలయ ఏఓ శ్రీనివా సరావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కు 5 దరఖాస్తులు వచ్చాయి. నెలలో ప్రతి 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్ కలెక్టరేట్ పరిపాలనాధికారి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చిన దరఖాస్తులను ఆయాశాఖలకు బదిలీల చేసినట్టు తెలియజేశారు. ఉద్యోగుల గ్రీవెన్స్ పై ఆయాశాఖల అధికారులు తీసుకున్న చర్యలను ఉద్యోగుల చరవాణీలకు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వం ఎంతో మంచి లక్ష్యంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఏర్పాటు చేసిందని, దానిని అన్నిశాల్లోని సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించి గ్రీవెన్స్ కి గుర్తింపు తీసుకురావాలన్నారు. ఈ గ్రీవెన్స్ ను ప్రభుత్వశాఖల్లోని 75శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.