అనకాపల్లిజిల్లా పోలీసు స్పందన కు 26ఫిర్యాదులు


Ens Balu
60
Anakapalle
2024-01-22 12:20:26

జిల్లా పోలీసు స్పందనకార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేకూర్చాలని ఎస్సీ కెవి.మురళీక్రిష్ణ అధికారులను ఆదేశిం చారు. సోమవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో అర్జీ దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించిన ఆయన చట్టపరిధిలోని ప్రభుత్వ నిబంధనల మేరకే పరిష్కారించాల్సిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆ విషయాన్ని అర్జీదారులకు తెలయజేయాలన్నారు. నేటి పోలీసు స్పందన కార్యక్రమానికి 26 ఫిర్యాదు లలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయి. అడిషనల్ ఎస్పీ పి.సత్యనారాయణరావు, ఎస్సై కె.సావిత్రి  పాల్గొన్నారు.