బాస్ ఈజ్ బ్యాక్..!


Ens Balu
3
కాకినాడ ఎస్పీ ఆఫీస్
2020-09-29 18:21:06

కరోనా వైరస్ ను జయించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి మంగళవారం విదుల్లోకి చేరారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్.పి. అడ్మిన్  కె.కుమార్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. నెగిటివ్ రిపోర్టులో విధుల్లోకి చేరిన అధికారులకు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి ఆనందంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా ఆత్మస్తై ర్యంతో హోంక్వారంటైన్ లో ఉండి వైరస్ ను జయించాలన్న ఎస్పీ ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ  స్వాగత కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటో బ్యూరో అడిషనల్ ఎస్.పి.   గరుడ్ సుమిత్, రంపచోడవరం ఏఎస్సీ జి.బిందు మాధవ్ ,  ఎస్బీ డిఎస్పీలు  ఎం. అంబికా ప్రసాద్, ఎస్.మురళీమోహన్, సిసిఎస్ డిఎస్పి వి. భీమారావు, పెద్దాపురం డి.ఎస్.  ఎ. శ్రీనివాస రావు, అమలాపురం  డి.ఎస్.పి  షేక్ మాసుం భాష, ఏఆర్ డిఎస్పి  ఎస్ వి. అప్పారావు, జిల్లా పొలిసు కార్యాలయ సూపరింటెండెంట్ లు, కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం ప్రెసిడెంట్ పి.సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.