విశాఖ ఎంపీ కేండిట్ విషయంలో టిడిపి వినూత్నవిధానం


Ens Balu
70
Visakhapatnam
2024-02-10 08:31:20

విశాఖ ఎంపీ కేండిట్ ను ఎంపిక చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ వినూత్న విధానాన్ని ఎంచుకున్నది. దానికోసం ప్రజల నుంచే స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఒక ఫోన్ కాల్ విశాఖలోని పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు వస్తుంది..అందులో శారాంశం ఏంటంటే మీతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడతారని, తప్పకుండా కాల్ లిఫ్ట్ చేయాలన్నది. ఆ వెంటనే మరొక ఫోన్ వస్తోంది. అందులో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా ఎం.భరత్ ను ఎంపిక చేయాలనుకుంటే ఒకటి నొక్కండి లేదు నోటా అనుకుంటే రెండు నొక్కండి అనే చంద్రబాబు వాయిస్ వినిపిస్తుంది బీప్ శబ్దం తరువాత ఓటరు తన నెంబరుని ఎంచుకున్న తర్వాత కాల్ కట్ అవుతుంది. అంటే విశాఖ ప్రజలు ఎవరిని ఎన్నకుంటారో తెలుసుకోవడానికి టిడిపి ఈ తరహా టెక్నాలజీని వినియోగించడం ఇపుడు నగరంలో చర్చనీయాంశం అవుతోంది. అంతేకాకుండా ఎంపీ రేసులో ఉన్నవారి పట్ల ప్రజల్లో ఎంత విశ్వాసం, నమ్మకం ఉందనే విషయంలో కూడా గ్రౌండ్ నెట్వర్క్ బృందాలు కూడా జనంలో కలసిపోయి పాన్ షాపులు, టీ షాపులు, సలూన్ షాపులు, చికెన్ మటన్ షాపులు, రైతు బజార్లు, సినిమా థియేటర్ల వద్ద కూడా కొందరు సర్వేలు చేస్తుండటం విశేషం. ఏ అభ్యర్ధి అయితే గెలుస్తారో తెలుసుకోవడానికి టిడిపి అన్ని రకాల చర్యలు చేపట్టడం ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రజల పల్స్ కూడా స్పష్టం చాలా చోట్ల బయటపడుతుంది. దానిని బట్టి విశాఖ ఎంపీ అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయి.

సిఫార్సు