నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీ లేఅవుట్ లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను చూపించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి లు సంయుక్తంగా హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మెన్ మోహిత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ లతో కలిసి జగనన్న కాలనీ లేఅవుట్ లలో సదుపాయాల కల్పన ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద లేఅవుట్ లలో పెండింగ్ మౌలిక అంశాలు ఏర్పాటుతో లబ్దిదారులకు వారి ఇంటి స్థలాలను చూయించా లని, దీనిపై హౌసింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో బాగంగా చంద్రగిరి నియోజకవర్గంకు సంబందించి వడమాల పేట, రామచంద్ర పురం మండల తదితర మండలాల్లోని జగనన్న కాలనీ లేఅవుట్ లలో పెండింగ్ అంశాలు ఉన్నవాటిలో గ్రావెల్ రోడ్, అప్రోచ్ రోడ్ వంటి స్టోన్ ప్లాంటేషన్ తదితర సదుపాయాలని కల్పించి త్వరగా లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను చూపించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేంకటేశ్వర రావు, హౌసింగ్ డిఈ లు, ఎ ఈ లు తదితరులు పాల్గొన్నారు.