ఎడ్‌సెట్‌ ‌పరీక్షకు సర్వం సిద్ధం..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-29 18:33:31

రాష్ట్ర వ్యాప్తంగా బిఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌ 2020 ‌నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.‌శివ ప్రసాద్‌ ‌తెలిపారు. ఆక్టోబర్‌ 1‌వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం సెట్‌ ‌కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆచార్య ఆర్‌.‌శివ ప్రసాద్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాలలో  50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9.00 గంటల నుంచి పరీక్ష కేంద్రాల లోనికి విద్యార్థులను అనుమతిస్తా మన్నారు.విద్యార్థులు తమవెంట హాల్‌టికెట్‌, ‌గుర్తింపు కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ మాస్క్ ‌ధరించి, శానిటైజర్‌ ఉపయోగించాలన్నారు.ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. ఎడ్‌సెట్‌ ‌ప్రవేశ పరీక్షకు మేథమేటిక్స్ ‌మెథడాలజీలో 4658, ఫిజికల్‌ ‌సైన్స్‌లో 2035, సోషల్‌ ‌సైన్స్‌లో 4779, బయలాజికల్‌ ‌సైన్స్‌లో 3321, ఇంగ్లీషు మెథడాలజీలో 865  మంది దరఖాస్తు చేసారన్నారు. ఉర్దూ మీడియంలో 97 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, భీమవరం, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంధ్యాల, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం, విజయనగరం నగరాలలో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.