అనకాపల్లి జనసేన-టిడిపి ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోనే ఉంటూ ప్రధాన సమస్యలపై పోరాడుతున్నయువనేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షలు టిడిపి యువనేత ఆడారి కిషోర్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్, జనసేనాని అన్నయ్య పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో కిషోర్, విజయ్ లు లోకల్ క్యాండిడేట్లు కాగా పొత్తుపార్టీ జనసేన నుంచి స్థానికుడిగా కొణతాల రామక్రిష్ణ, కొణిదెల నాగబాబు మాత్రం నాన్ లోకల్. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో లోకల్ ఫీలింగ్ పెద్ద ఎత్తున వస్తుండటంతో ఇపుడు ఉమ్మడి విశాఖజిల్లాలోని అనకాపల్లి ఎంపీ స్థానానికి డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ పార్టీ ముందు కాస్త ఆర్ధిక బలాన్ని చూపిస్తున్న మరో వ్యక్తి పేరు కూడా సామాజిక మాద్యమల్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ప్రముఖంగా పోటీ మాత్రం ఈ ముగ్గురిలోనే కనిపిస్తున్నది. ఆది నుంచి అనకాపల్లి పార్లమెంటు ఎంపీ సీటుని ఆశిస్తున్న ఆడారి కిషోర్ కుమార్ పార్టీలోని అందరు సీనియర్ నాయకులతోపాటు అధినేత చంద్రబాబుని సైతం స్వయంగా తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీస్థాయిలో పనిచేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇటీవల మాడుగుల మండలంలో జరిగిన టిడిపి కదిలిరా సభలో నేరుగా అయ్యన్నపాత్రుడు చంద్రబాబుని స్టేజి మీద నుంచే తన కొడుక్కు కి ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు. వీరిద్దరి మధ్యలో ఈసారి అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం, దానికి అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు జరుపుతుండటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
అనకాపల్లి సీటు తనకు ఇవ్వాలని..లేని పక్షంలో చింతకాలయ విజయ్ కి ఇచ్చినా తాను శ్రమించి పనిచేస్తానని కిషోర్ కుమార్ అయ్యన్నపాత్రుడినే అభ్యర్ధించారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజవకర్గాల్లో డెమెక్రసీ ఇన్ డేంజర్, సేవ్ డెమెక్రసీ పేరటి సుమారు 54 రోజుల పాటు ఉద్యమాలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్న అన్నిరోజులూ కిషోర్ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసంఘాలు, అన్ని రాజకీయపార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. అంతేకాకుండా ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం, విమానాలు, రైళ్లు, డిల్లీ వేదిక గా కూడా తన గళాన్ని బలంగా వినిపించారు. అయితే చాలా కాలంగా పార్టీలో సీనియర్ నేతగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా గెలిచి పార్టీని అభివృద్ధి చేశానని..తన తరువాత తన వారసుడికి సీటు ఇవ్వడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధి చేస్తాని అయ్యన్నపాత్రుడు సైతం తన డిమాండ్ ను పార్టీ ముందు ఉంచుతున్నారు. ఇదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన ఒక ట్రస్టు సభ్యుడు వీరిద్దరికంటే తాను ఆర్ధికంగా బలంగా ఉన్నానని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలిపించుకుంటానని ప్రచారం చేసుకుంటూ..తనకే ఎంపీ సీటు ఖరారు అయిపోయిం దని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆడారి కిషోర్ కుమార్ కి సామాజిక బలం ఎక్కువగా ఉండటం, గతంలో బీజేపీ లాంటి పార్టీలో పనిచేసి ఉండ టం, స్థానికు కావడంతో అటు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలిసింది.
అయితే టిడిపిలో చేరిన తరువాత పతాక స్థాయిలో కార్యక్రమాలు చేస్తూ, ప్రజల్లోనే ఉంటూ తన పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈయన పార్టీ ఏం చేసినా తాను శిరసా వహిస్తానంటూ తన పనిచేసుకొని వెళుతున్నారు. దీనితో ప్రస్తుతం పార్టీ అధిష్టానం ఈ మూడు పేర్లు పరిగణలోకి తీసుకొని బేరీజు వేస్తున్నాయి. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ సామాజిక బలం ఉన్న నాయకులను రంగంలోకి దించడం ద్వారా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్నది. అదే సమయంలో జనసేన సీనియర్ నేత కాకపోయినా ఇటీవలే పార్టీలోకి చేరిన కొణతాల రామక్రిష్ణనైనా సామాజికంగా బేరీజు వేస్తూ ఎంపీగా దించాలని యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడటం టిడిపిలో ఇంకా ఎమ్మెల్యే స్థానాలే ఖరారు కాకపోవడం, ఎంపీ స్థానానికి బలమైన పోటీ ఉండటంతో అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు, సొంతపార్టీ నిర్వహిస్తున్న సర్వేలో సైతం ఈ మూడు పేర్లేనే ప్రస్తావిస్తుండటం విశేషం. అధికార పార్టీ, వారి గ్రౌండ్ నెట్వర్క్ లలో కూడా ఈ మూడు పేర్లకు డిమాండ్ ఉండటంతో అటు కొందరు సీనియర్లు కూడా సీటు గవర సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా పైచేయి సాధించడానికి అవకాశం వుంటుందనే విషయంలో కాస్త సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నది. కౌన్ బనేగా అనకాపల్లి ఎంపీ సీటు ఈ ముగ్గురిలో ఎవరిని వరిస్తోందో..లేదంటే ఆర్దికంగా బాలంగా ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్న నాన్ లోకల్ ట్రస్ట్ నిర్వాహకుడికి వస్తుందో లేదంటే ఇటీవలే పార్టీలో చేరిన కొణతాల రామక్రిష్ణను వరిస్తుందోననేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది..!